ఆ గుడిలో దొంగతనం చేస్తే పిల్లలు పుడతారా.. ఆ గుడి ఎక్కడుందంటే?

దేశంలో చాలామంది సరైన సమయంలో పిల్లలు పుట్టకపోవడం వల్ల నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు పుట్టడం లేదని చెబుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఒక గుడిలో దొంగతనం చేస్తే మాత్రం కచ్చితంగా పిల్లలు పుడతారని పండితులు చెబుతున్నారు. ఉత్తరాఖాండ్ లో ఉన్న గుడిని దర్శించుకుంటే సంతాన యోగం కలుగుతుంది.

గుడికి వెళ్లి దొంగతనం చేస్తే పిల్లలు పుడతారనే సెంటిమెంట్ వింతగా ఉన్నా ఆ గుడి గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఈ గుడిలో దేవత అనుగ్రహం పొందితే పిల్లలు పుడతారని చెబుతున్నారు. ఈ గుడి ఎంత పెద్ద కోరిక కోరుకున్నా కచ్చితంగా తీరుస్తుందని అందుకు సంబంధించి ఎలాంటి సందేహం లేదని వెల్లడిస్తున్నారు. రూర్కి జిల్లాలోని చుడియాల గ్రామంలో ఉన్న ఈ గుడి ఉత్తరాఖాండ్ లోని పాపులర్ గుడులలో ఒకటని చెప్పవచ్చు.

ఇక్కడ ఉన్న చూడామణి ఆలయంను దర్శించుకుంటే కోరిన ప్రతి కోరిక తప్పకుండా నెరవేరడంతో పాటు సంతాన యోగం లభిస్తుంది. ఈ ఆలయం గొప్పదనం ఏంటంటే ఇక్కడికి వచ్చి దొంగతనం చేసిన వాళ్లలో ఎక్కువమందికి మగ పిల్లలు పుట్టారు. మగ పిల్లలు సంతానంగా కావాలని భావించే వాళ్లు సైతం ఈ గుడిని దర్శించుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్లు చెక్కబొమ్మను దొంగతనం చేయాలి.

ఈ వెరైటీ నమ్మకాన్ని పాటించి మన దేశంలో చాలామంది దంపతులు సంతాన యోగం పొందారు. చెక్కబొమ్మను దొంగలించిన తర్వాత మరో చెక్కబొమ్మను తయారు చేయించి ఆలయం దగ్గర ఉంచాలి. ఉత్తరాఖాండ్ కు వెళ్లిన వాళ్లు ఈ గుడిని దర్శించుకుని కోరిన కోరికలను నెరవేర్చుకుంటే మంచిది.