ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగే విధంగా వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. టీచర్ జాబ్ లో స్థిరపడాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఏకంగా 8000కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో సైతం ఉద్యోగ ఖాళీల దిశగా అడుగులు పడటంతో నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. ప్రైమరీ ట్రైన్డ్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండగా సెప్టెంబర్ నెల 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఉంది.
పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ పాసైన వాళ్లు పీజీటీ పోస్టుల కోసం దరఖాసు చేసుకోవచ్చు. సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ పాసైన వాళ్లు టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. స్థానికంగా ఉండే ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేస్తారు.
ఎవరైతే పరీక్ష క్వాలిఫై అవుతారో వాళ్లు నేరుగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని తెలుస్తోంది.