నెలకు రూ.5 వేల పెట్టుబడితో భారీగా ఆదాయం పొందే అవకాశం.. ఏం చేయాలంటే?

ప్రస్తుత కాలంలో దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టాలంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలు కచ్చితంగా సొంతమవుతాయని చెప్పవచ్చు. భారతదేశంలో ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్స్‌ బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌గా మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు ఏడాదికి కనీసం 10 శాతం రిటర్న్స్ లభించే అవకాశాలు అయితే ఉంటాయి. నెలకు 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసేవాళ్లు 30 సంవత్సరాల తర్వాత ఏకంగా కోటి రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. కేవలం 18 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఊహించని లాభాలు అయితే కచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు.

అయితే మ్యూచువల్ ఫండ్స్ ఒకింత రిస్క్ తో కూడుకున్నవి. ప్రతి సందర్భంలో మ్యూచువల్ ఫండ్స్ తో కచ్చితమైన లాభాలు వస్తాయని మాత్రం చెప్పలేము. కొన్ని ఫండ్స్ ఏకంగా 89 శాతనికి పైగా లాభాలను అందించాయి. నిపుణుల సలహాలు తీసుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టపోయే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటే మాత్రమే పెట్టుబడులు పెట్టాలి.

ఎంచుకునే ఫండ్స్ విషయంలో పొరపాట్లు చేస్తే మాత్రం దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో స్వల్ప కాలానికి ఇన్వెస్ట్ చేయడం వల్ల మాత్రం పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్వెస్ట్ చేసేవాళ్లు లాభ నష్టాల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది.