కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ అమలు చేస్తున్న ఈ స్కీమ్స్ వల్ల చాలామంది ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్స్ పొందుతున్నారు. అయితే మోదీ సర్కార్ ఒక కాంటెస్ట్ లో ఎంపికైన వాళ్లకు ఏకంగా 50,000 రూపాయలు అందిస్తుండటం గమనార్హం. ల్యాక్‌పతి దీదీ పేరుతో మోదీ సర్కార్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
సామాజిక ఆర్థిక విధానాల్లో మహిళల ప్రాధాన్యతను మరింత పెంచాలనే ఆలోచనతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. మైగౌ భాగస్వామ్యంతో గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో వాళ్లు 50,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌కు చెందిన మహిళల సాధికారతను సూచించడంతో పాటు స్వయం సహాయక సంఘాల లక్ష్యం లక్షాధికారులు అవ్వడం గురించి తెలియజేసేలా లోగో ఉండాలి.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని లోగోను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. జూన్ నెల 10వ తేదీన ఈ కాంటెస్ట్ మొదలుకానుండగా ఈ నెల చివరి వరకు ఈ పోటీలో పాల్గొనడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అదిరిపోయే డిజైన్ తో లోగోను క్రియేట్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా సులువుగా ఈ పోటీకి ఎంపిక కావచ్చు.
మన దేశానికి చెందిన పౌరులు ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. రూరల్ డెవలప్‌మెంట్ శాఖ ఈ పోటీలో గెలిచిన వాళ్లకు డబ్బులు అందజేస్తుందని తెలుస్తోంది. ఈ పోటీలో పాల్గొనడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.