రైతులకు శుభవార్త చెప్పిన మోడీ సర్కార్… పెరిగిన పిఎం కిసాన్ డబ్బులు?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటవ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్లో భాగంగా రైతులకు ప్రయోజనం కలుగునున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది రైతులకు వ్యవసాయ పనులలో ఆసరాగా ప్రధానమంత్రి పీఎం కిసాన్ సంబంధించిన పథకం కింద ప్రతి రైతు అకౌంటులో 6000 జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ డబ్బులను 12 విడతలుగా రైతుల ఖాతాలో జమ చేశారు.

ఇలా ప్రతి ఏడాది ఆరువేల రూపాయలను మూడు విడుదలగా 2000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేసేవారు. అయితే ఈ పీఎం కిసాన్ సమాన్ ఇది యోజన ద్వారా రైతుల ఖాతాలో పడే డబ్బులు ఈ ఏడాది నుంచి పెరగబోతున్నట్లు తెలుస్తోంది. రైతుల ఖాతాలో ప్రతి ఏడాది 8 వేల రూపాయలు చొప్పున డబ్బులను జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇప్పటికే ఎంతోమంది రైతులు లబ్ధి పొందారు. అయితే రైతులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రయోజనాలను పొందాలి అంటే తప్పనిసరిగా రైతులు రిజిస్ట్రేషన్ మరియు కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. 2019 ముందు వరకు కేవలం రెండు హెక్టార్ల భూమి ఉన్న రైతులు మాత్రమే ఇందుకు అర్హులుగా ఉండేవారు. అయితే 2019 నుంచి ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ ప్రయోజనం అందేలా మోడీ సర్కార్ చర్యలు తీసుకుంది. అయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఎనిమిది వేలకు పెంచనున్నారని తెలియడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.