వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేసేవాళ్లకు షాక్.. క్యాన్సర్ తో పాటు ఆ సమస్యలు కూడా వస్తాయట!

ప్రస్తుత కాలంలో క్యాన్సర్ తో బాధ పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ వ్యాధి బారిన పడి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తే వేగంగా కోలుకునే అవకాశం అయితే ఉంటుంది. క్యాన్సర్ ను ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం ఈ వ్యాధిని జయించడం మాత్రం సులువు కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేసేవాళ్లకు ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వచ్చే ఛాన్స్ ఉంది.

కదలకుండా కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్లు అండాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్ లతో పాటు కొలోరెక్టల్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని చెప్పవచ్చు.

జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వల్ల నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. వ్యాయామం చేయని వాళ్లకు శరీరంలో కొవ్వు చేరే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్లో కూర్చుని పని చేసేవాళ్లకు డయాబెటిస్ ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కదలకుండా ఉండేవాళ్లకు కీళ్ల సమస్యలు వచ్చే అవకాశంతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యలను అధిగమించే అవకాశం అయితే ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల లాభాలే తప్ప ఎలాంటి నష్టాలు ఉండవు. చిన్నచిన్న వ్యాయామాలు చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.