డిప్రెషన్ సమస్యను దూరం చేసే మ్యాజిక్ పుట్టగొడుగులు?

ప్రపంచవ్యాప్తంగా మానసిక రుగ్మతలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు అత్యంత ప్రమాదకరంగా పెరుగుతోందని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక పని ఒత్తిడి, ఆరోగ్య కారణాలు, కుటుంబ కారణాలు, డ్రగ్స్, మద్యపానం దుమాపానం లాంటి చెడు అలవాట్లకు బానిస కావడం లాంటి కారణాలతో ఎక్కువ మంది మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ బారిన పడుతున్నారు.డిప్రెషన్ తగ్గించడంలో సిలోసిబిన్ అనే మ్యాజిక్ పుట్టగొడుగులు దివ్య ఔషధంలా పనిచేస్తుందని ఇటీవల కొన్ని పరిశోధనల్లో తెలిసింది. ఆ పరిశోధన ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లండన్‌కి చెందిన కంపాస్ పాథ్‌వేస్ అనే మెంటల్ హెల్త్ కేర్ పరిశోధన సంస్థ మానసిక సమస్యతో బాధపడుతున్న 233మందిని రెండు గ్రూపులగా చేసి, కొందరికి సిలోసిబిన్ అనే మ్యాజిక్ పుట్టగొడుల్ని 25 మిల్లీ గ్రాముల ఇచ్చారు. మిగతావాళ్లకు తక్కువ డోస్ ఇచ్చారు.21 రోజుల తర్వాత రెండు గ్రూపుల వాళ్లని పరిశీలించగా తక్కువ మోతాదు తీసుకున్న వారి కంటే
25 మి.గ్రా. సిలోసిబిన్ మ్యాజిక్ పుట్టగొడుగులు ఆహారంగా తీసుకున్నవాళ్లలో మానసికంగా స్థిరత్వం ఏర్పడి డిప్రెషన్ సమస్య తగ్గిందని పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నారు.

సాధారణంగా మానసిక సమస్యలతో బాధపడే వారికి డిప్రెషన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను తగ్గించడానికి సైకోథెరపీ ట్రీట్మెంట్ వైద్యులు ఇస్తుంటారు.అయితే ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా చాలామంది డిప్రెషన్ లక్షణాలు తగ్గవు.అలాంటివాళ్లకు మ్యాజిక్ పుట్టగొడుగుల ట్రీట్మెంట్ చేస్తే డిప్రెషన్ నుంచి బయటపడతారని ఈ పరిశోధనలో పాల్గొన్న జేమ్స్ రుకర్‌ అనే ప్రముఖ మానసిక వైద్య నిపుణులు వెల్లడించారు.

సిలోసిబిన్‌ మ్యాజిక్ పుట్టగొడుగులోని సైకోయాక్టివ్ పదార్థాలు ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసే నాడీ కణ వ్యవస్థ పై మరియు మెదడు భాగాలపై ప్రభావంతంగా పనిచేసి మనలోని మానసిక ఒత్తిడిని, డిప్రెషన్ వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని మానసిక వైద్యులు చెబుతున్నారు.