శని పీడ నుంచి తప్పించుకోవాలా.. కచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు ఇవే!

Shani

మనలో చాలామంది శనిగ్రహ ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. శని ప్రభావం మనపై ఉంటే మనం ఏ పని చేసిన శుభ ఫలితాలను పొందలేమనే సంగతి తెలిసిందే. అయితే కొన్నిసార్లు మనం చేసే పనులు మనపై ప్రభావం చూపుతాయి. మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండగా చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

శని యొక్క వక్ర దృష్టి వల్ల డబ్బు సంబంధిత సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఆర్థిక సంబంధమైన సమస్యలు, వ్యాధులకు శని కారణమవుతుందని చెప్పవచ్చు. ఎవరైతే ఉద్యోగులను, పేదలను మోసం చేస్తారో వాళ్లపై దీర్ఘకాలం శని ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంటుంది. అమాయక జంతువులను వేధించడం చేయకూడదు. ఎవరైతే నిస్సహాయులుగా ఉంటారో వారిని అవమానించడం కరెక్ట్ కాదు.

మహిళలకు, పేదలకు, నిస్సహాయులకు సహాయం చేయడం ద్వారా శని దయ మనపై కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. పెంపుడు జంతువులను పెంచుకుని వాటికి తగిన సమయంలో ఆహారం, నీరు అందించడం ద్వారా శని పీడ దూరమవుతుంది. కష్టపడి పని చేసేవాళ్లకు శని శుభ ఫలితాలను అందించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

గోళ్లు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతిరోజూ స్నానం చేసి దేవుడిని పూజించే వాళ్లకు సులభంగా శుభ ఫలితాలు దక్కే అవకాశాలు ఉంటాయి. మద్యం సేవించడం, మాంసాహారం తీసుకోవడం శని దేవునికి ఇష్టం ఉండదు. ఈ పనులు చేయడం ద్వారా శని దేవుని అనుగ్రహాన్ని సులభంగా పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.