దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఈ పాలసీలలో ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ కూడా ఒకటి. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు నెలకు 20,000 రూపాయల పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీ సింగిల్ ప్రీమియం పాలసీ కాగా 80 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.
ఈ పాలసీలో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఏడాదికి రూ.64,350 యాన్యుటీ లభిస్తుంది. ఆప్షన్ 2 ఎంచుకుంటే పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి భార్య కూడా పెన్షన్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీలో 40 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నెలకు 20,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో డబ్బులు వచ్చిన వాళ్లు ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయే అవకాశాలు తగ్గుతాయి. పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే నామినీ ఈ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రతీ నెలా ఆదాయం లేదా పెన్షన్ కావాలనుకుంటే ఈ పాలసీని ఎంచుకోవడం ఉత్తమమని చెప్పవచ్చు. సమీపంలోని బ్రాంచ్ ద్వారా ఈ పాలసీ గురించి తెలుసుకోవచ్చు.
ఎల్ఐసీ పాలసీని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో భారీ స్థాయిలో బెనిఫిట్ పొందే అవకాశం ఉండటంతో ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఎంచుకోవడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో లాభం పొందవచ్చు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచి డబ్బులను పొదుపు చేస్తే మంచిదని చెప్పవచ్చు.