దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవన్ శాంతి పాలసీ పేరుతో ఒక పాలసీని అమలు చేస్తుండగా ఈ పాలసీ వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వృద్ధాప్యంలో ప్రాథమిక అవసరాలు తీరడానికి రెగ్యులర్ ఆదాయం కావాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా, స్వతంత్రంగా ఉండాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది.
ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో స్కీమ్స్ ఉన్నా ఆ స్కీమ్స్ కంటే ఎక్కువ మొత్తం వడ్డీ రూపంలో పొందాలని భావించే వాళ్లకు మాత్రం ఎల్ఐసీ జీవన్ శాంతి పాలసీ బెస్ట్ పాలసీ అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా నెలకు 10000 రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తం ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇండివిడ్యువల్, సింగిల్ ప్రీమియం, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ గా ఈ ప్లాన్ ఉంది.
సింగిల్ లైఫ్ యాన్యుటీ, డిఫర్డ్ జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్స్ ఈ పాలసీలో ఉంటాయి. సింగిల్ లైఫ్ యాన్యుటీ లేదా జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్లలో ఒకటి ఎంచుకునే ఛాన్స్ ఉండగా పాలసీ హోల్డర్ జీవించి ఉన్నంత కాలం సింగిల్ లైఫ్ యాన్యుటీ పేమెంట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. జాయింట్ లైఫ్ యాన్యుటీ ప్లాన్ ఎంచుకుంటే జీవిత భాగస్వామిలలో ఎవరో ఒకరు జీవించి ఉన్నంత వరకు పెన్షన్ పొందవచ్చు. ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థికంగా చేయూత అందించడంలో ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎల్ఐసీ జీవన్ శాంతి పాలసీలో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 30 నుంచి 79 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు కాగా ఈ స్కీమ్ లో 12 సంవత్సరాలు యాన్యుటీ చెల్లింపులను వాయిదా వేస్తే 13వ సంవత్సరం నుంచి ఏకంగా 1,32,920 పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.