ఎల్ఐసీ సూపర్ పాలసీ.. నెలకు రూ.1200 కడితే భారీ మొత్తం పొందే ఛాన్స్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ పాలసీల వల్ల పాలసీ లబ్ధిదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతోంది. ఎల్ఐసీ పాలసీలలో జీవన్ ఉమాంగ్ పాలసీ ఒకటి కాగా ఈ పాలసీ 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లకు బెస్ట్ పాలసీ అవుతుందని చెప్పవచ్చు. ఈ పాలసీ ద్వారా లైఫ్ కవరేజ్ తో పాటు మెచ్యూరిటీ సమయంలో పాలసీ డబ్బులను పొందవచ్చు.

55 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 30 ఏళ్ల వయస్సులో ఉన్నవాళ్లు 5 లక్షల రూపాయల బీమాకు పాలసీ తీసుకుంటే నెలకు 1280 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారులు తమకు నచ్చిన విధంగా పాలసీ టర్మ్ ను ఎంపిక చేసుకోవచ్చు. 30 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే 30 ఏళ్ల తర్వాత సంవత్సరానికి 40,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.

99 సంవత్సరాల వరకు ఇదే విధంగా డబ్బులు లభిస్తాయి. 100వ సంవత్సరం వచ్చిన తర్వాత బీమా, బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ లభిస్తాయి. 5 లక్షల రూపాయలకు బీమా తీసుకుంటే 40 లక్షల రూపాయల రేంజ్ లో బెనిఫిట్ లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పాలసీని తీసుకున్న వాళ్లు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు. జీవన్ ఉమాంగ్ పాలసీ అన్ని వయస్సుల వారికి బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు.

ఎల్.ఐ.సీ పాలసీ తీసుకోవడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా బెనిఫిట్ కలుగుతుంది. తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో ఎక్కువ బెనిఫిట్ పొందాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ పాలసీ అవుతుంది. పాలసీపై ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే పాలసీ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.