దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పదవీ విరమణ తర్వాత ఆదాయం కోరుకునే వారికి మేలు చేసేలా న్యూ జీవన్ శాంతి యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఇప్పటినుంచి ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు సొంతమవుతాయి. పదవీ విరమణ తర్వాత ఆదాయం పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెట్టవచ్చు.
ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి స్కీమ్ యాన్యుటీ స్కీమ్ కాగా ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఫిక్స్ చేయడంతో ప్రతినెలా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు మరణించిన సమయంలో నామినీ ఖాతాలో డబ్బులు జమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కొత్త జీవన్ శాంతి పథకం కనీస ప్లాన్ ధర లక్షన్నర రూపాయలు కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు.
మీరు మీ అవసరాన్ని బట్టి వార్షిక, 6 నెలలు, 3 నెలలు లేదా నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు గరిష్టంగా రూ.12,000 పెన్షన్ లభిస్తుంది. ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఎక్కువ మొత్తం పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎల్ఐసీ పాలసీల గురించి పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది.
ఎల్ఐసీ పాలసీలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సొంతమవుతుంది. ఎల్ఐసీ పాలసీలకు సంబంధించి సందేహాలు ఉంటే ఏజెంట్లను సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పాలసీల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్స్ పొందవచ్చు.