దేశీయ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ కూడా ఒకటి. రోజుకు కేవలం రూ.253 రూపాయలు ఆదా చేయడం వల్ల ఈ పాలసీతో కళ్లు చెదిరే మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీ నాన్ లింక్డ్ ప్రాఫిట్ ప్లాన్ కావడం గమనార్హం. పరిమిత ప్రీమియం చెల్లింపుతో ఈ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు మెచ్యూరిటీ పూర్తైన తర్వాత ఏక మొత్తం పొందే అవకాశం ఉంటుంది. 10, 13, 16 సంవత్సరాలకు ప్రీమియంను డిపాజిట్ చేయడం ద్వారా ఈ పాలసీకి అర్హత పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీ ద్వారా పాలసీదారునికి చివరి అదనపు బోనస్ తో పాటు రివర్షనరీ బోనస్ లభించే అవకాశం అయితే ఉంటుంది. 59 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు.
కనీసం 25 సంవత్సరాల పాటు ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తే 54 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. సమీపంలో ఎల్.ఐ.సీ బ్రాంచ్ ను సంప్రదించి ఎల్.ఐ.సీ ఏజెంట్ ద్వారా ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పాలసీలో చేరిన వాళ్లు సంవత్సరానికి 92,400 రూపాయలు ప్రీమియం చెల్లించాలి. ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను అమలు చేస్తూ కస్టమర్లకు ప్రయోజనం కలిగేలా చేస్తుండటం గమనార్హం. అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఎంచుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.