ఎల్ఐసీ సూపర్ పాలసీ.. ఒకేసారి రూ.54 లక్షలు పొందే ఛాన్స్.. ఏం చేయాలంటే?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ ఒకటి కాగా ఈ పాలసీ ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. బీమా కవరేజీతో పాటు పెద్ద మొత్తంలో ఆదాయం పొందాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ను అందిస్తున్న ఈ పాలసీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.

ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ మొత్తం లభించే ఛాన్స్ ఉండటంతో ఎక్కువమంది ఈ పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పాలసీదారుడు మరణిస్తే నామినీ ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పాలసీ ఎండోమెంట్ ప్లాన్ కాగా ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు డెత్ బెనిఫిట్, మెచ్యూరిటీ, ట్యాక్స్ బెనిఫిట్, లోన్ ఫెసిలిటీ బెనిఫిట్స్ లభిస్తాయి.

పాలసీదారుడు పాలసీ టర్మ్ ముగిసే వరకు జీవించి ఉంటే మరింత ఎక్కువ మొత్తం బెనిఫిట్స్ లభిస్తాయి. 30 సంవత్సరాల వయస్సులో 20 లక్షల రూపాయలకు బీమా తీసుకుంటే ఏడాదికి 90,867 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు 54 లక్షల రూపాయల బెనిఫిట్ లభించే అవకాశాలు ఉంటాయి. 25 సంవత్సరాల మెచ్యూరిటీ టర్మ్ ఎంచుకున్న వాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు.

59 ఏళ్ల వయసు వరకు ఈ పాలసీని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు చివరి 6 సంవత్సరాల పాటు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. దీర్ఘకాలిక టెన్యూర్ ఎంచుకోవడం ద్వారా ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉండగా ఈ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది.