ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ గురించి తెలుసా.. రూ. 252 పెట్టుబడితో రూ. 54 లక్షలు సంపాదించే ఛాన్స్!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఈ పాలసీల ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చనే సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ ఒకటి కాగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఈ పాలసీ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ మొత్తంలో బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

 

ఈ పాలసీ తీసుకోవడం ద్వారా బీమా రక్షణతో పాటు పొదుపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. పాలసీ హోల్డర్‌ చనిపోతే నామినీ పాలసీ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఐదు, పది, పదిహేను సంవత్సరాల వ్యవధితో ఈ పాలసీ తీసుకునే ఛాన్స్ ఉండగా కనీసం 5 లక్షల రూపాయల నుంచి ఎక్కువ మొత్తానికి కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు.

 

మెచ్యూరిటీ తర్వాత డబ్బులు పొందే అవకాశంతో పాటు డెత్ బెనిఫిట్ ద్వారా కూడా డబ్బులను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు ఐదు రకాల ఆప్షనల్‌ రైడర్‌ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 20 లక్షల రూపాయల బీమా పాలసీ తీసుకున్న వాళ్లు ఏడాదికి రూ. 90,867 ప్రీమియం చెల్లిస్తే మెచ్యూరిటీ సమయంలో 54 లక్షల రూపాయలు పొందవచ్చు.

 

సమీపంలోని బ్రాంచ్ ఆఫీస్ ద్వారా ఈ పాలసీకి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. తక్కువ పెట్టుబడితో ఈ పాలసీ ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ ను పొందవచ్చు. జీవన్ లాభ్ పాలసీ అన్ని వయస్సుల వాళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.