దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పది పాసైన విద్యార్థులకు తీపికబురు అందించింది. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విద్యాదాన్ స్కాలర్‌షిప్స్ కొరకు దరఖాస్తులను స్వీకరిస్తూ ఉండటం గమనార్హం. ఇంటర్, డిగ్రీ పాసైన స్టూడెంట్స్ సైతం ఈ స్కాలర్ షిప్ ద్వారా బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు చదవలేని విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
పదో తరగతిలో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి వార్షికాదాయం ఏటా రూ.3,60,000 లోపు ఉన్న కుటుంబానికి చెందిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బాలికలకు, దివ్యాంగులకు, తల్లిదండ్రులు లేనివాళ్లకు ఈ స్కాలర్ షిప్ విషయంలో ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది.
ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్‌షిప్ ద్వారా ఇంటర్ చదువుతున్న విద్యార్థుల ద్వారా సంవత్సరానికి రూ.15,000 చొప్పున స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ , టెన్త్ మార్క్స్ షీట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇంటర్మీడియట్ అడ్మిషన్ ప్రూఫ్, అకడమిక్ ఇయర్ ఫీజ్ రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. బడ్డీ ఫర్ స్టడీ పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు స్కాలర్ షిప్ ను మంజూరు చేయడం జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే బెనిఫిట్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.