భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగలలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. bdl-india.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగష్టు నెల 21వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుండగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.
సెప్టెంబర్ నెల 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మొత్తం 45 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మేనేజ్‌మెంట్ ట్రైనీ , వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండగా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్, ఇతర విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది.
150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. https://bdl-india.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ స్థాయిలో వేతనం లభించనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.