బియ్యం తరచూ పురుగు పడుతోందా.. నిల్వ ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలివే!

Rice_AdobeStock_64819529_E

మనలో చాలామంది బియ్యం పురుగు పట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఏడాది పొడవునా పురుగు పట్టకుండా బియ్యాన్ని నిల్వ ఉంచుకోవడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బియ్యం పురుగు పట్టకుండా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వంటకాలలో ఉంచే ఇంగువను బియ్యంలో ఉంచితే బియ్యం పురుగు పట్టే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

వేపాకు రెబ్బలను ఎండబెట్టి బియ్యంలో కట్టినా బియ్యం పురుగు పట్టే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు. బియ్యానికి తేమ తగలడం వల్ల తక్కువ సమయంలోనే పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బియ్యం బస్తాలు నిల్వ చేసే ప్రదేశంలో చీమల మందు చల్లడం ద్వారా కూడా బియ్యం పురుగు పట్టకుండా జాగ్రత్త పడవచ్చు. ఘాటైన సువాసన ఉన్న కర్పూరం కూడా బియ్యంకు పురుగు పట్టకుండా చేస్తుంది.

బియ్యం సంచులలో లవంగాల పొడిని ఉంచడం ద్వారా కూడా బియ్యం పురుగు పట్టకుండా చేయవచ్చు. బియ్యం డబ్బాలో ఎండు మిరపకాయలు వేయడం ద్వారా కూడా బియ్యం పురుగు పట్టకుండా చేసుకోవచ్చు. పొగాకు, బెల్లం బియ్యంలో ఉంచినా బియ్యం పురుగు పట్టే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు. బియ్యం సంచుల మధ్య డిసికాన్ ప్యాకెట్లను ఉంచినా పురుగు పట్టే ఛాన్స్ తక్కువగా ఉంటుంది.

ఈ చిట్కాలను పాటించినా ఫలితం లేకపోతే కొన్ని కెమికల్స్ ను ఉపయోగించడం ద్వారా సులువుగా బియ్యాన్ని నిల్వ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తినే బియ్యం విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.