తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్ అర్హతతో సొంత ప్రాంతంలో జాబ్స్!

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ అర్హతతో తెలంగాణ సర్కార్ ఔట్ సోర్సింగ్ పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం గమనార్హం. ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి మహిళ, శిశువికలాంగులు మరియు వయోవృద్ధుల శాఖ నుంచి వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు

ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 సంవత్సరం జులై 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది.

35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నైపుణ్యం , అనుభవం ఆధారంగా అభ్యర్థికి వెయిటేజీ ఇవ్వడం జరుగుతుందని సమాచారం అందుతోంది.

జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉండనుంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 15, 600 రూపాయల నుంచి 28,000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది.