ఆర్థికంగా ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. ప్రజల్లో ఆర్థిక భద్రత పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెడుతోంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో మరో కొత్త స్కీమ్ పై కూడా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మరొక కొత్త స్కీం ప్రవేశ పెట్టింది. ఇది వన్- టైమ్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సరికొత్త స్కీం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అర్హత వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• ఈ స్కీమ్ లో మహిళలు లేదా ఆడపిల్లల పేరు మీద డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
• ఇక ఈ స్కీమ్ లో మీరు గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
• మీరు పెట్టిన పెట్టుబడి మీద 7.5 శాతం ఫిక్స్‌డ్ వడ్డీ రేటు లభిస్తుంది.
• అయితే ఈ స్కీమ్ లో విడతల వారీగా కాకుండా మొత్తం డబ్బు ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
• 2025 మార్చి వరకు ఇది అందుబాటులో ఉంటుంది.
• సాధారణ చిన్న పొదుపు పథకాల కంటే కూడా ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మహిళలు ఎక్కువ లాభాన్ని పొందవచ్చు.
• ఈ స్కీమ్ కి రెండేళ్ల లాక్- ఇన్ పీరియడ్ ఉంటుంది. అలానే కావాలంటే మధ్యలో విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం వుంది.
ఈ స్కీమ్ ద్వారా 7.5 శాతం వడ్డీ ని పొందొచ్చు. ఇతర చిన్న పొదుపు పథకాల కంటే కూడా ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్స్ కన్నా కూడా ఈ స్కీం వలనే ఎక్కువ లాభం ఉంటుంది. 2023 జనవరి- మార్చి త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన కింద 7.6 శాతం వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ కింద అయితే 8 శాతం వడ్డీ వస్తుంది. కానీ ఇందులో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చెయ్యాలి. అయితే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం లో తక్కువ కాలం ఇన్వెస్ట్ చేయటం వల్ల ఎక్కువ లాభం పొందవచ్చు.