టైటిల్ చూసి కొంచెం షాక్ అయినట్టున్నారు కదా. బాత్ రూంలో ఉప్పును పెట్టుకొని ఏం చేయాలి అంటారా? దానికంటే ముందు మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలి. అదే వాస్తు గురించి. ఈరోజుల్లో వాస్తును నమ్మని వాళ్లు ఎవ్వరూ ఉండరు. దేవుడిని నమ్మని వాళ్లు అయినా ఉంటారేమో కానీ.. వాస్తును మాత్రం నూటికి నూరు శాతం ఫాలో అయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు. మన దేశంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే.. ఇప్పుడు వాస్తు ప్రకారం ఉప్పును ఎక్కడ ఉంచితే ఎటువంటి ఫలితాలు వస్తాయి.. అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి..
నిజానికి ఉప్పుతో మనకు విడదీయలేని బంధం. కూరల్లో ఏది వేసినా వేయకున్నా.. ఉప్పు లేకపోతే మాత్రం ఆ కూర రుచే మారిపోతుంది. కానీ.. ఉప్పు కూరల్లో ఎక్కువైతే ఆరోగ్యం పాడవుతుంది. కానీ.. మన జీవితంలో మాత్రం ఉప్పు మేలే చేస్తుందట. వాస్తు దోషాలను నివారించుకోవడానికి ఉప్పును అన్ని రకాలుగా వాడుకోవచ్చట. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని దూరం చేయడానికి ఉప్పు ఎంతో దోహదపడుతుందట.
ఎవరి ఇంట్లో అయినా ఏదో ఒక వాస్తు దోషం ఉంటూనే ఉంటుంది. అటువంటి వాళ్లు ఒక గ్లాసు ఉప్పు తీసుకొని దాన్న బాత్ రూంలో ఉంచాలి. అలా ఉంచితే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అంతే కాదు.. ఎన్నో ఆటంకాలు తొలిగిపోతాయట. ఇదంతా మేం చెబుతున్నది కాదు.. పెద్ద పెద్ద వాస్తు పండితులే ఉప్పు ప్రయోజనాలను వాస్తు పుస్తకాల్లో రాశారు.
అలాగే ఉప్పును బాత్ రూంతో పాటుగా.. బెడ్ రూంలో ఉంచితే కూడా చాలా మంచిదట. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం కలిగినా.. వీక్ నెస్ గా ఉన్నా… ఓ రాగి పాత్రలో కొంచెం ఉప్పును తీసుకొని బెడ్ రూంలో ఉంచాలి. అలా చేస్తే అనారోగ్యం సమస్యలు దూరమవుతాయి.
అలాగే.. ఎర్రటి వస్త్రంలో ఉప్పును చుట్టి… ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. దీని వల్ల నర దిష్టి తగ్గడంతో పాటుగా నెగెటివ్ ఎనర్జీ కూడా దూరం అవుతుంది. వ్యాపారస్తులు అయితే తమ షాపు ముందు గుమ్మానికి ఎర్రటి వస్త్రంలో ఉప్పును కట్టి గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం కూడా కలిసివస్తుంది.
చూశారుగా.. ఉప్పును కూరలో వాడటమే కాదు.. వాస్తు పరంగానూ దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో?