ఆవాలతో ఇలా చేస్తే చాలు…ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు?

సహజంగా ఆవాలను వంటల్లో సుగంధ ద్రవ్యంగా వాడుతారు. ఆవనూనెను ఆయుర్వేద వైద్యంలో అనేక వ్యాధులు నయం చేయడానికి ఇప్పటికి ఉపయోగిస్తున్నారు. ఆవగింజల్లో మెగ్నిషియం, మాంగ‌నీస్, కాల్షియం, జింక్ వంటి మిన‌ర‌ల్స్ తోపాటు ఫైబర్,ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టు రాలడం, చుండ్రు ,దురడ, పొడి చర్మం, దద్దుర్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే చుండ్రు, జుట్టు రాలడం, పేనుకొరకు వ్యాధి నివారించడంలో ఆవాలు ఏ విధంగా ఉపయోగపడతాయి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవ గింజల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కావున వీటి నుంచి తీసిన నూనెను అప్పుడప్పుడు తలకు మర్దన చేసుకుంటే వెంట్రుకలు మృదువుగా దృఢంగా పెరుగుతాయి. అలాగే ఇందులో ఉండే ఔషధ గుణాల కారణంగా చుండ్రు, కురుపులు, దురదలు వంటి సమస్యలను అరికట్టవచ్చు.పేలు తగ్గదడానికి ఆవాలపొడితో పాటు ఆవల నూనె రాసుకోవాలి .

ఆవగింజలను బాగా వేయించి పొడిగా మార్చుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తీసి తురమాలి. ఈ తురుము నుండి రసాన్ని వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో ఆవాల పొడి, ఉల్లిపాయ రసం, ఒక గుడ్డు తెల్ల సోన, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు సమస్య క్రమంగా తగ్గిపోతుంది.

ఆవ గింజల్లో ఉండే సహజ యాంటీ ఫంగల్ లక్షణాలు తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి చుండ్రు, పొక్కులు వంటి సమస్యలను అరికడతాయి. అలాగే జుట్టు కుదుళ్ళను దృఢంగా ఉంచి బట్టతల, వెంట్రుకలు తెల్లబడడం వంటి సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది. ఆవాల్లో ఉండే ఘాటైన సువాసన కారణంగా కొందరిలో అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటివారు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.