బట్టతలపై జుట్టు రావాలా.. ఈ చిట్కాలు పాటిస్తే బట్టతల సమస్యకు చెక్ అంటూ?

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని బట్టతల సమస్య వేధిస్తోంది. కొంతమంది ఈ సమస్య వల్ల చిన్న వయస్సులోనే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలా కనిపిస్తున్నారు. బట్టతలపై జుట్టు పెరిగే అవకాశం చెబితే చాలామంది నమ్మరు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా బట్టతలపై కూడా జుట్టు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో పురుషులతో పాటు స్త్రీలను సైతం ఈ సమస్య వేధిస్తోంది.

ఒత్తిడి, నిద్రలేమి, జుట్టుకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు బట్టతల వచ్చే అవకాశం ఉంది. ఈ చిట్కాలు సహజ చిట్కాలు కావడం గమనార్హం. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ వల్ల తలకు రక్తప్రసరణ జరుగుతుంది. ఉల్లిపాయలను గ్రైండ్ చేసి ఉల్లిపాయ రసానికి తేనె కలిపి తలకు పట్టించడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఆముదం ఉపయోగించడం ద్వారా బట్టతల సమస్య దూరమవుతుంది.

ఆముదం మాయిశ్చరైజింగ్ ఏజెంట్ గా పని చేయడంతో పాటు జుట్టు, చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. కలబంద ప్లాంట్ హెర్బాషియస్ ప్లాంట్ కాగా పోషకాలు ఎక్కువగా ఉండే ఈ ప్లాంట్ జుట్టు, చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో తోడ్పడుతుంది. ఆలోవెరా జెల్ జుట్టు పెరుగుదలకు సహాయపడటంతో పాటు జుట్టు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు.

బట్టతలకు చెక్ పెట్టడంలో మెంతులు ఎంతగానో తోడ్పడతాయని చెప్పవచ్చు. మెంతులను నీళ్లలో నానబెట్టి నానబెట్టిన మెంతులను తలకు అప్లై చేయడం మంచిది. ఈ విధంగా చేయడం ద్వారా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. ఈ చిట్కాలు పాటించడంతో పాటు వైద్యులను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు.