జులై నెలలో 31 రోజులు ఉంటాయనే సంగతి మనందరికీ తెలిసిందే. జులై నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులకు సెలవులు కావడం గమనార్హం. బ్యాంక్ లలో ఎక్కువగా లావాదేవీలు నిర్వహించే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. జులైలో రెండు, నాలుగో శనివారాలు సహా 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేసి ఉంటాయని సమాచారం అందుతుండటం గమనార్హం.
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు కాబట్టి ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలపై ఆధారపడిన వాళ్లు ఎలాంటి ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. బ్యాంక్ వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు, ఏటీఎంల సహాయంతో సులభంగానే లావాదేవీలను నిర్వహించే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.
జులై నెల 3వ తేదీన షిల్లాంగ్, మేఘాలయాల్లో బెహ్ డైంఖ్లామ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు దినంగా ఉందని తెలుస్తోంది. జులై 6వ తేదీన ఎంహెచ్ఐపీ డే సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేస్తారని సమాచారం. జులై 7వ తేదీ ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. జులై 8న మణిపూర్‌లో రథ యాత్ర సందర్భంగా బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.
జులై 9న సిక్కింలో ద్రుప్‌కా షిజి సందర్భంగా బ్యాంకులకు హాలిడే కాగా జులై 13 రెండో శనివారం, జులై 14 ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు దినంగా ఉంది. జులై 16న హరేలా సందర్భంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులకు హాలీడేగా ఉండగా జులై 17న మొహర్రం పండుగ సందర్భంగా సెలవు దినంగా ఉంది. జులై 21 ఆదివారం కాగా జులై 28 రెండో శనివారం జులై 29 ఆదివారం కావడంతో సెలవు దినంగా ఉంది.