ప్రస్తుత కాలంలో చాలామంది బరువు సమస్య వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గాలని భావించే వాళ్లు వ్యాయామంతో పాటు డైట్ పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. కొంతమంది బరువు తగ్గడం కోసం చపాతీ తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బరువు తగ్గడానికి చపాతీ కంటే రొట్టె మంచిదని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.
జొన్నపిండితో తయారు చేసిన బ్రెడ్ తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్‌తో నిండిన మిల్లెట్ లను తినడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. రోటీ తినడం అలవాటు లేని వాళ్లు ఇప్పటినుంచైనా ఆ అలవాట్లను మార్చుకుంటే మంచిది. వర్కౌట్స్ చేసినా బరువు తగ్గకపోవడానికి కొన్ని సందర్భాల్లో తీసుకునే ఆహారం కూడా కారణం అవుతుందని చెప్పవచ్చు.
బజ్జీ, బోండాలాంటి నోటికి రుచికరమైన ఆహారం తినడం వల్ల సులువుగా బరువు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. చలికాలంలో బరువు తగ్గాలనుకుంటే కొన్ని చిట్కాలను పాటించడం మంచిది. నారింజ పండు విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అత్తి పండ్లలో ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఈ పండ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ లభిస్తాయి. జామకాయ చలికాలంలో తప్పకుండా తీసుకుంటే మంచిది. మలబద్ధకం సమస్యలకు కూడా జామకాయ తింటే ఉపశమనం లభిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.