రైతులకు అదిరే గుడ్ న్యూస్.. టాక్టర్ కొనుగోలుపై ఏకంగా రూ.లక్షా 15 వేల డిస్కౌంట్!

ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేసే రైతులకు ట్రాక్టర్ ఎంతో అవసరం అనే సంగతి తెలిసిందే. ట్రాక్టర్ ను కొనుగోలు చేయడం వల్ల వ్యవసాయ పనులను తక్కువ సమయంలో వేగంగా పూర్తి చేయవచ్చు. ట్రాక్టర్ ను వినియోగించడం వల్ల రైతుల విలువైన సమయం వృథా కాదు. అయితే ప్రముఖ ట్రాక్టర్ తయారీ కంపెనీ జాన్ డీర్ రైతులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ట్రాక్టర్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఈ ట్రాక్టర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

 

ఈ ట్రాక్టర్ అసలు ధర 8,30,000 రూపాయలు కాగా డిస్కౌంట్ పోనూ కేవలం రూ. 7,15,000 కు లభ్యమవుతోంది. ఈ ట్రాక్టర్ ను కొనుగోలు చేయడం ద్వారా లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం డిస్కౌంట్ పొందడంతో పాటు తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లు ఉన్న ట్రాక్టర్ ను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ నెలాఖరు లోపు ట్రాక్టర్ ను కొనుగోలు చేసిన వాళ్లు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు ఈ ఆఫర్ ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందవచ్చు. కనీసం లక్ష రూపాయల డౌన్ పేమెంట్ ను చెల్లించి ఈ ట్రాక్టర్ ను సులువుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. తీసుకున్న రుణాన్ని 5 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించవచ్చు. సమీపంలోని ట్రాక్టర్ షోరూంను సంప్రదించి ఈ ట్రాక్టర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

 

షోరూమ్ ను బట్టి ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. జాన్ డీర్ షోరూమ్‌ నిర్వాహకులను సంప్రదించి ఈ ట్రాక్టర్ ను సులువుగా కొనుగోలు చేయవచ్చు. ఈ ట్రాక్టర్ ను వ్యవసాయ పనుల కోసం, ఇతర అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.