మనలో చాలామంది నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధించాలని ఉన్నా రాతపరీక్షకు భయపడి ఇబ్బంది పడుతున్నారు. అయితే రాతపరీక్ష లేకుండా విశాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, ఇతర క్యాడర్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటం గమనార్హం. నాలుగో తరగతి ఉద్యోగి నుంచి స్టాఫ్ నర్సు, ఇతర టెక్నిషియన్ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.
కేజీహెచ్ తో పాటు అనుబంధ సంస్థలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తం ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 30 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ జరగనుండగా ఫార్మాసిస్టులు, ఇతర నాల్గోవ తరగతి ఉద్యోగులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఆపరేషన్ థియేటర్లోని పలు క్యాడర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో దరఖాస్తులను స్వీకరిస్తారని తెలుస్తోంది.
ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతోంది. ఈ నెల 25వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారని సమాచారం అందుతోంది. మెరిట్ లిస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను చేపడుతున్నారని భోగట్టా. అర్హత ఉన్న అభ్యర్థుల జాబితాను మార్చి నెల 1వ తేదీన రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటిస్తూ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.