కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు.. రూ.లక్ష కంటే ఎక్కువ వేతనంతో?

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 74 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

మేనేజ్‌మెంట్ ట్రైనీ మార్కెటింగ్‌లో 60 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా మేనేజ్‌మెంట్ ట్రైనీ లా 4 ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎఫ్‌అండ్‌ ఏ 10 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫోటో, సంతకంతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

2023 సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మార్కెటింగ్ లేదా ఇతర సబ్జెక్టులలో 2 సంవత్సరాల ఫుల్ టైం డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు మేనేజ్‌మెంట్ ట్రైనీ మార్కెటింగ్ పోస్ట్‌కు అర్హులు కాగా లాలో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బి డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 నుండి రూ.1,40,000 వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.