రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలో 1217 ఉద్యోగాలు.. అత్యంత భారీ వేతనంతో?

ఈ మధ్య కాలంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలు వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుండగా మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. వేర్వేరు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అడ్మిన్ అసిస్టెంట్, సెంటర్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలతో పాటు అకౌంట్స్ ఆఫీసర్, అడ్మిన్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

https://www.lifecarehll.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జులై నెల 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 1217 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగులకు ఒకింత భారీ స్థాయిలోనే ప్రయోజనం చేకూరనుంది.

సీఏ/సీఎంఏ ఇంటర్, ఎంకామ్, ఎంబీఏ చదివిన వాళ్లు సైతం అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఐదేళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్నవాళ్లు అడ్మిన్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు.

ఎంబీఏ లేదా ఏదైనా విభాగంలో పీజీ పూర్తిచేసి రెండేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్లు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏ చేసిన వాళ్లు సెంటర్ మేనేజర్ ఉద్యోగాలకు అర్హులు కాగా సంస్థ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.