నెలకు 37,000 వేతనంతో భారీగా ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 15 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా 2023 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రెజ్యూమ్ ను ఈమెయిల్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వయస్సు ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 37,000 రూపాయల వేతనం లభించనుందని తెలుస్తోంది. obs.hmi@ediindia.org ఈ మెయిల్ కు రెజ్యూమ్ తో పాటు అవసరమైన ధృవపత్రాలను పంపాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు కర్ణాటక రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రాబోయే రోజుల్లో వేతనం భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉందని సమాచారం.