ఈ పంట పండిస్తే రైతులకు లాభాలే లాభాలు.. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు సొంతం?

మన దేశంలో ప్రాంతాలను బట్టి వేర్వేరు పంటలను పండిస్తారనే సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తి, వరి, సోయాబీన్ లాంటి పంటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండగా రాయలసీమలో వేరుశనగ, మొక్కజొన్న, కొర్రలు, ఆరు తడుల పంటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కోస్తాంధ్ర జిల్లాలలో ఎక్కువగా వరి, ఇతర కూరగాయల పంటలను ఎక్కువగా పండిస్తారనే సంగతి తెలిసిందే.

అయితే మారుతున్న కాలంతో పాటే ప్రజలకు కొన్ని సందర్భాల్లో కొత్త పంటల వైపు కూడా ఆసక్తి కలుగుతుంది. అలాంటి పంటలలో బుక్వీట్ ఒకటి కాగా ఇది ఒక రకమైన మిల్లెట్ పిండి కావడం గమనార్హం. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ లో బుక్వీట్ ను ఎక్కువగా పండిస్తారు. ఈ కొత్తరకం పంటకు మార్కెట్ లో ఊహించని స్థాయిలో డిమాండ్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రబీ సమయంలో ఎక్కువగా ఈ పంటను సాగు చేయడం జరుగుతుంది. ఇవి ఒక రకమైన పండ్ల విత్తనాలు కావడం గమనార్హం. ఈ పండ్ల విత్తనాలను పొడిలా చేసుకుని వేర్వేరు వంటకాలను చేసుకుని తినే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇది ఒక కొత్త రకమైన మినుము పిండి కావడం గమనార్హం. బుక్వీట్ కేజీ ధర 120 రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది.

ఎవరైనా ఈ పంటను సాగు చేయాలని భావిస్తే జార్ఖండ్ నుంచి విత్తనాలను సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 6.5 నుంచి 7.5 మధ్య పీహెచ్ స్థాయి ఉన్న నేలల్లో పంటలను సాగు చేస్తే మంచిది. ఈ పంట తక్కువ సమయంలోనే వస్తుంది కాబట్టి పెట్టుబడి కూడా తగ్గుతుందని చెప్పవచ్చు.