మనలో చాలామంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలను సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు కొన్ని వ్యాపారాలపై దృష్టి పెడితే మంచిది. తక్కువ పెట్టుబడితో మ్యాంగో పికిల్ బిజినెస్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మన దేశానికి చెందిన వాళ్లు ఊరగాయలు ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే.
ప్రతి ఒక్కరి ఇంట్లో నిల్వ పచ్చళ్లు ఉండటం సాధారణంగా జరుగుతుంది. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యేవాటిలో పచ్చళ్లు ముందువరసలో ఉంటాయి. మన దేశం ఊరగాయలకు పెద్ద మార్కెట్ ప్రత్యేకం అని చెప్పాల్సిన అవసరం లేదు. వేసవిలో దొరికే మామిడి కాయలతో చేసే ఆవకాయ, ఊరగాయలను ఏడాదంతా రుచి చూడటానికి చాలామంది ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే.
గృహిణులు, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలనుకునే మహిళా వ్యాపారవేత్తల పచ్చళ్ల వ్యాపారం మంచి బిజినెస్ అవుతుంది. బిజినెస్ రిజిస్ట్రేషన్, లైసెన్స్ తీసుకుని ఈ బిజినెస్ ను సులువుగా మొదలుపెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఉత్పత్తిని పరిశీలించి లైసెన్స్ ను జారీ చేయడం జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అన్ని అర్హతలు ఉన్నవాళ్లు కేవలం 15 రోజుల్లో సులువుగా లైసెన్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి. లక్ష రూపాయల పెట్టుబడితో సులువుగా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువగా ఉండే ఐటెమ్స్ తయారు చేయడంపై దృష్టి పెడితే కళ్లు చెదిరే లాభాలు సులువుగా సొంతమవుతాయి.