పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారా.. ఏం చేయాలంటే?

రెండు తెలుగు రాష్ట్రాలలో పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. మెజారిటీ విద్యార్థులు పది పరీక్షల్లో మంచి ఫలితాలను సొంతం చేసుకున్నారు. ఏపీలో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య భారీ స్థాయిలోనే ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 10 జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొంతమంది ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల పదో తరగతి అర్హతతోనే చదువుకు దూరమవుతున్నారు.

 

అయితే పది అర్హతతోనే సులభంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంది. పది తర్వాత ఐటీఐ చదివితే తక్కువ సమయంలో ఉద్యోగం సంపాదించవచ్చు. అయితే ఐటీఐ చదివిన వాళ్లకు వేతనాలు తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రభుత్వ శాఖల్లో పని చేయాలని భావించే వాళ్లకు ఐటీఐ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ఉద్యోగాలకు పోటీ కూడా ఒకింత తక్కువగానే ఉంటుంది.

 

పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఐటీఐ ప్రవేశాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలో ఐటీఐ ఉద్యోగాలకు సంబంధించి వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉంటున్నాయి. పదో తరగతి పాసైన ఈ ఉద్యోగాలపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్లు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఐటీఐకు రాబోయే రోజుల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంది.

 

కెరీర్ పరంగా త్వరగా సెటిల్ కావాలని భావించే వాళ్లు ఐటీఐ దిశగా అడుగులు వేస్తే మంచిదని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఐటీఐ ఉద్యోగాల వల్ల నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.