ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సైంటిస్ట్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. vssc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జులై 21వ తేదీ సాయంత్రం వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
మొత్తం 61 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్డీ, సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయండగా ఎస్డీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. ఇతర ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు 750 రూపాయలు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు చెల్లించిన ఫీజు మొత్తాన్ని రీఫండ్ చేయనున్నారని తెలుస్తోంది. isro.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అహ్మదాబాద్, చెన్నై, ఎర్నాకులం, తిరువనంతపురం, హైదరాబాద్ లలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రాత పరీక్ష జరగనుందని సమాచారం అందుతోంది.
రాత పరీక్ష ఫలితాలను బట్టి 1 : 5 రేషియో ఇంటర్వ్యూలకు పిలవడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 56100 రూపాయల నుంచి 2,08,700 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.