ఇస్రోలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్.. మంచి వేతనంతో?

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సైంటిస్ట్, ఇంజనీర్ పోస్టులకు ఇస్రో నుంచి జాబ్ నోటిఫికేషన్ వెలువడగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతుండటం గమనార్హం.

సైంటిస్ట్ ఇంజనీర్- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలతో పాటు సైంటిస్ట్ ఇంజనీర్- అగ్రికల్చర్, సైంటిస్ట్ ఇంజనీర్- అట్మాస్ఫియరిక్ సైన్సెస్ అండ్ ఓషనోగ్రఫీ ఉద్యోగ ఖాళీల కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఎమ్మెస్సీ అగ్రికల్చర్ ఫిజిక్స్ పూర్తి చేసిన వాళ్లు ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్- అగ్రికల్చర్ జాబ్ కు అర్హులు కాగా కనీసం 65 శాతం మార్కులతో ఎమ్మెస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఎమ్మెస్సీ ఫిజిక్స్ లేదా ఓషన్ సైన్సెస్‌, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, మెటియోరాలజీ చదివిన వాళ్లు సైంటిస్ట్ ఇంజనీర్- అట్మాస్ఫియరిక్ సైన్సెస్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ రెండు ఉద్యోగ ఖాళీలకు 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ఇమేజ్ ప్రాసెసింగ్/ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ చదివిన వాళ్లు సైంటిస్ట్ ఇంజనీర్-కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.

30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. రాతపరీక్ష, అభ్యర్థి ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే వాళ్లకు రూ.1,77,500 వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.