భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 435 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు 273 ఉండగా టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు 162 ఉన్నాయి.
మెటలర్జీ, ప్రొడక్షన్, ఫైర్ అండ్ సేఫ్టీ, హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ విభాగాలతో పాటు ఏరోస్పేస్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 28 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
అప్రెంటిస్ శిక్షణ వ్యవధి ఏడాది కాగా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు నెలకు 9000 రూపాయల స్టైఫండ్ పొందే అవకాశం ఉంటుంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. శిక్షణ సమయంలో నెలకు 8000 రూపాయల స్టైఫండ్ పొందే ఛాన్స్ ఉంటుంది.
రాత పరీక్ష లేకపోవడం. ఇంటర్వ్యూ, అకాడమిక్ పరీక్షల్లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుండటంతో నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇస్రో జాబ్ నోటిఫికేషన్ కావడంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది.