సాధారణంగా లైంగికపరమైన విజ్ఞానం గురించి చాలామందికి అవగాహన ఉండదు.సెక్స్ సంబంధిత అంశాలను తెలుసుకోవడానికి చాలామందికి ఆసక్తి ఉన్నప్పటికీ మొహమాటం, సిగ్గు, బెదురు వంటి కారణాలతో వెనకడిగేస్తుంటారు. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి సెక్స్ సంబంధించిన అంశాలపై ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాలి .అప్పుడే శృంగారానికి సంబంధించిన ఆపోహాల నుంచి మనం బయటపడగలుగుతాం. సాధారణంగా సెక్స్ సంబంధించిన అంశాల్లో ఎక్కువగా ఉండే ఆపోహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా పెళ్లి తర్వాత ఎక్కువ రోజులు సంతానం కలగకపోతే స్త్రీలలోనే లోపం ఉందని అందరూ భావిస్తారు అది పొరపాటు సంతానం కలగకపోవడానికి స్త్రీలలో ఎన్ని సమస్యలు ఉంటాయో పురుషుల్లో కూడా అన్నే లైంగిక సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా పురుషుల్లో అంగస్తంభన సమస్య, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వంటి కారణాలతో సంతానలేమి సమస్య ఏర్పడవచ్చు.
కొంతమంది అభిప్రాయం ప్రకారం గర్భనిరోధక మాత్రలు వాడితే అన్ని రకాల లైంగిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని భావిస్తుంటారు. కానీ అలా జరగదు గర్భనిరోధక మాత్రలు వాడితే కేవలం అవాంచిత గర్భ రాకుండా మాత్రమే నివారిస్తుంది. లైంగికంగా వచ్చే వ్యాధులను ఎట్టి పరిస్థితులను ఆపలేదు.
లైంగిక వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి కొంతమంది రెండు కండోమ్స్ ఉపయోగిస్తుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే నాణ్యమైన ఒక కండోమ్ ఉపయోగిస్తే చాలు చాలు లైంగిక వ్యాధులను రక్షణ పొందవచ్చు. పైగా రెండు కండోమ్స్ వాడితే సున్నితమైన అవయవాలపై రాపిడి పెరిగి అనేక సమస్యలు తలెత్తవచ్చు.
కొందరి అభిప్రాయం ప్రకారం స్వలింగ సంపర్కులకు మాత్రమే హెచ్ఐవీ వస్తుందని భావిస్తారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే హెచ్ఐవి ఉన్న వారితో లైంగిక సంపర్కం చేస్తే ఎలాంటి వారికైనా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంటుంది.
చాలామంది సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయకూడదని చెబుతున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమే.లైంగిక సంపర్కం తర్వాత మూత్రవిసర్జన చేయడం చాలా మంచిది. సంభోగం సమయంలో మనలో ప్రవేశించిన వ్యాధికారకాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా మూత్ర విసర్జన చేయాలని నిపుణులు చెప్తున్నారు.