మీ భార్య మిమ్మల్ని దూరం పెడుతుందా… ఇలా ప్రయత్నించి చూడండి!

husband_wife_upset_argument

భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అలా కాకుండా చీటికిమాటికి చిరాకు పడుతూ గొడవలు పడుతుంటే చాలా అసహ్యంగా ఉండడమే కాకుండా మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. దాంపత్య జీవనం సాఫీగా సాగిపోవాలంటే దంపతుల మధ్య ప్రేమానురాగాలు, నమ్మకం, ఆప్యాయతతో పాటు శారీరక తృప్తి కూడా ఎంతో అవసరం. శారీరక శ్రమ, పని ఒత్తిడి, ఆరోగ్యం ఇలా రకరకాల కారణాలతో చాలామంది స్త్రీలు తమ భర్తలను పడకగదిసుఖానికి దూరం చేస్తుంటారు.

ప్రస్తుత కాలంలో భార్య భర్తలు ఇద్దరు కూడా సంపాదనలో పడి పగలంతా ఎంతో కష్టపడుతూ ఉద్యోగాలు చేసి ఇంటికి వస్తుంటారు అయితే ఇలా రాత్రి పని ఒత్తిడి కారణంగా భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనడానికి వీలు కుదరదు. ఈ విధంగా రోజు శృంగారంలో పాల్గొనలేకపోయిన కనీసం వారంలో ఒకటి లేదా రెండు రోజులు భార్యాభర్తలు సంతోషంగా సరదాగా గడపడం ఎంతో ముఖ్యం అప్పుడే వారి మధ్య ఉన్న బంధం బలపడుతుంది.

ఇలా కాకుండా భార్య భర్త దగ్గరకు వస్తేనే తనని దూరం పెట్టడం వల్ల భర్తకు లేనిపోని అనుమానాలు తలెత్తుతాయి తద్వారా స్త్రీలకు అక్రమ సంబంధాలు ఉన్నాయని అనుమానాలు కూడా వారికి కలగవచ్చు.అయితే మీ భార్య మిమ్మల్ని ఎందుకు దగ్గరకు రానివ్వడం లేదో వారితో ప్రేమగా మాట్లాడుతూ తెలుసుకోవాలి. సాధారణంగా స్త్రీలు శృంగార విషయంలో కొంత మొహమాటం, బెరుకు ఉంటుంది. మీరే ఆమెను అర్థం చేసుకొని ఆమె పట్ల సున్నితంగా వ్యవహరించాలి. శృంగార విషయంలో ఏమాత్రం తొందరపాటు పడకూడదు. పెళ్లయిన తర్వాత కూడా కొన్ని భయాలు వాళ్లను వెంటాడుతుంటాయి. భర్తగా నీ భార్య భయాలను పోగొట్టి ఆమెను ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. పడకగదిలో మీ భార్య పట్ల చిరాకు పడకుండా ప్రేమగా మాట్లాడుతూ ముగ్గులోకి దించాలి. ఇలా ప్రేమగా మాట్లాడుతూ వారిలో ఉన్న భయాలను పోగొట్టి భార్యకు దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలి.