రోడ్డు పక్కన పానీ పూరి బండి కనిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా పానీపూరి తినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. రోజు రోజుకు పానీపూరి ప్రియులు మరింత పెరిగారు. అంతేకాకుండా పానీ పూరి స్టాల్స్ కూడా విరివిగా పెరిగాయి. ఇక పానీపూరి అతిగా తినడం వల్ల అది మన ఆరోగ్యానికి ముప్పు అని కొందరు సూచిస్తుంటే. కొంతమంది నిపుణులు మాత్రం పానీ పూరి నీళ్లు తాగడం వల్ల మన శరీరానికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
పానీ పూరిలో ఎక్కువగా ఉపయోగించే వేడి నీరు రుచిగా ఉండే కారం ఇది మన శరీరానికి ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా శరీర బరువు తగ్గాలనుకునేవారు ఈజీగా బరువు తగ్గవచ్చు. అయితే ఇంట్లో మనం తయారు చేసుకున్న పానీ పూరి తినడం ఎంతో మంచిదని పనులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో తయారుచేసిన పానీ పూరి లో పుదీనా, జీలకర్రను తగిన మొత్తంలో వేసుకుంటారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన నీటిని పానీపూరిలో ఉపయోగిస్తారు. తద్వారా కడుపు ఉబ్బరం, అలసట వంటి సమస్యలను దూరం పెట్టవచ్చు.
పుదీనా కలిపిన పానీ పూరిను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో కలిగే పుదీనా నీరు శరీర బరువు తగ్గడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది అని తెలియజేస్తున్నారు. ఇక రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా పుదీనా మంచిగా సహాయ పడుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా పానీ పూరిలో ఉపయోగించే జీలకర్ర మన శరీర ఆరోగ్యంలో ఎంతో మేలు చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.ఇలా ఆరోగ్యానికి మంచిది అన్న ఉద్దేశంతో ఎక్కువగా ఈ పని తీసుకోవటం వల్ల కొందరిలో అజీర్తి గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు తలెత్తుతాయి కనుక మోతాదుకు మించి ఈ పానీ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు