ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. నిజంగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ జీవిత భాగస్వామి అయితే మీ కంటే అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. ప్రస్తుత కాలంలో ఇలాంటి ప్రేమ చాలా కరువైందని చెప్పాలి.చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ ఎడమొహం పేడ మొహం పెట్టుకొని కష్టపడుతూ గడుపుతున్న వారు ఉన్నారు అలాగే మరికొందరు ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు లేకపోయినా సంపాదన వ్యామోహంలో పడి ఇద్దరి మధ్య ప్రేమ అనే పదానికి తావు లేకుండా జీవిస్తున్నారు.
నిజంగా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీ జీవితంలో ఉంటే తాను నీపై శ్రద్ధ చూపిస్తున్నాను అనే విషయం
అందరూ తెలుసుకోవాలి అని ఆరాటపడడు. ఎవరు చూసినా చూడకున్నా తాను మాత్రం మీ పట్ల ఎంతో ఆప్యాయత శ్రద్ధ చూపిస్తాడు మీ తర్వాతే ఏదైనా అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. మిమ్మల్ని అన్ని విధాలుగా మంచి వ్యక్తిగా మారుస్తాడు. వారు మీ కలలను సాధించడానికి మిమ్మల్ని ఆ దిశగా నడిపించడంతోపాటు అవసరమైతే నీవు వేసే ప్రతి అడుగులో నీ వెంటే ఉంటారు. శారీరకంగా సంతోషించ పెట్టేవారు చాలా మందే ఉంటారు.కానీ మీ పట్ల నిజాయితీగా ఉంటూ మీకు మానసిక ధైర్యాన్ని కూడా అందిస్తాడు. మిమ్మల్ని ఎప్పుడూ సురక్షితంగా ఉంచడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు.
మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ జీవితంలో ఉంటే మీ అవసరాలను మీకంటే ముందే గ్రహించి వాటిని నెరవేర్చడానికి ఎంత కష్టమైనా భరిస్తారు.మిమ్మల్ని మోసం చేయాలనుకునేవారు వారి వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ మీ ముందు ప్రస్తావించరు. అదే మిమ్మల్ని ప్రేమించే వారు తనకు సంబంధించిన అన్ని విషయాలు మీతో చర్చించడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ తప్పుడు దారిలో వెళ్లడానికి అనుమతించరు. అలాగే మీ ఆలోచనలను అణిచివేసే నియంతలా కూడా వ్యవహరించరు. మీ కలలను నెరవేర్చడం కోసం మీ వెనకే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీ గెలుపుకు కారణం అవుతారు. అందుకే నిజమైన ప్రేమ మన జీవితంలో గెలుపుకు తొలిమెట్టు అని పెద్దలు చెబుతూ ఉంటారు.