సాధారణంగా అబ్బాయి తనకంటే చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెబుతుంటారు. అలాంటి వివాహాలని మనం ఎక్కువగా చూస్తుంటాం.అయితే ఈ మధ్యకాలంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకోవడం ఎక్కువయ్యాయి. అయితే ప్రేమకు వయసు అడ్డులేదు అనే నినాదం కూడా ఎక్కువగా వినపడుతుంది. ఈ క్రమంలోనే అబ్బాయిలు ఎక్కువగా తమ కన్నా వయసులో పెద్దవారైనటువంటి అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా వయసులో తమకన్నా పెద్ద వారిని అబ్బాయిలు ప్రేమించడానికి ఇష్టపడటానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే….
తమకంటే పెద్దవారైనా స్త్రీలతో ప్రేమలో పడడానికి కారణం తమకన్నా పెద్దవారైతే అన్ని విషయాల్లో మార్గదర్శకంగా ఉంటారు.అధిక పరిపక్వత స్థాయి, తెలివిగా కమ్యూనికేషన్, తక్కువ ఆధారపడటం మొదలైన అనేక కారణాల వల్ల పురుషులు తమ కంటే పెద్ద వయస్సు గల అమ్మాయిల వైపు ఆకర్షితులవుతారట. ఇలా వయసు పెద్దది ఉన్నటువంటి అమ్మాయిలు ప్రతి ఒక్క విషయంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా కుటుంబ వ్యవహారాలను చక్కపరచడంలో కూడా మంచి పరిజ్ఞానం కలిగి ఉంటారు.
ఇలా సంసారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిపోవడానికి పరిపక్వత ఎంతో అవసరం కనుక అబ్బాయిలు తమ కన్నా వయసులో పెద్దగా ఉన్నటువంటి మహిళలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. తమకంటే పెద్దవారైనా స్త్రీలను పురుషులు ఇష్టపడడానికి మరో కారణం వయసులో తమకన్నా పెద్ద స్త్రీలు, యువ పురుషుల కంటే ఎక్కువ జీవితానుభవాన్ని కలిగి ఉండడం వల్ల స్థిర ఆలోచనలతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.ఈ కారణాల చేతనే ఎక్కువ వయసు ఉన్నటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు ఇష్టపడుతున్నారు.