ఈ మధ్య కాలంలో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే మాత్రమే కలకాలం సంతోషంగా ఉండటం సాధ్యమవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ లేని పక్షంలో ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. ఈరోజుల్లో అమ్మాయిలు తమకు నచ్చిన లక్షణాలు ఉన్న వ్యక్తులను మాత్రమే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారనే సంగతి తెలిసిందే.
అబ్బాయిల విషయంలో రాజీ పడటానికి అమ్మాయిలు అస్సలు ఇష్టపడటం లేదు. అమ్మాయిల అభిరుచులు సైతం మారడం వల్ల ఎంచుకునే భాగస్వామి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భాగస్వామి విషయంలో తప్పులు చేస్తే జీవితాంతం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి అమ్మాయికి మనస్తత్వానికి అనుగుణంగా అభిరుచులు ఉంటాయనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అమ్మాయిలు ఎంచుకునే అబ్బాయి మంచి ఉద్యోగం సాధించడంతో పాటు ఆ అబ్బాయికి ఎక్కువ వేతనం ఉండాలని ఫీలవుతున్నారు. స్వతంత్రం ఇచ్చే భర్త కావాలని వాళ్లు చెబుతున్నారు. తమను గౌరవించడంతో పాటు ప్రతి పనిలో సహాయం చేసే వ్యక్తులు భర్తగా కావాలని అమ్మాయిలు ఫీలవుతున్నారు. మర్యాద ఇచ్చే భర్త కావాలని అమ్మాయిలు సూచనలు చేస్తుండటం గమనార్హం.
తమకు ఆకర్షించడం కోసం పిచ్చిపిచ్చి వేషాలు వేసే వ్యక్తులను అమ్మాయిలు ఎప్పటికీ ఇష్టపడరు. ఒరిజినల్ బిహేవియర్ తో మంచిగా ఉండే అబ్బాయిలను మాత్రమే అమ్మాయిలు ఇష్టపడతారు. అమ్మాయిలు అర్థం చేసుకునే భాగస్వామిని ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇతరులకు నచ్చిన విధంగా అమ్మాయిలు ఉంటే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.