పెళ్లి తరువాత అమ్మాయిలు బరువు పెరగడానికి శృంగారమే కారణమా…నిపుణులు ఏం చెబుతున్నారంటే?

సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు త్వరగా బరువు పెరుగుతారన్న వాదన చాలా కాలంగా నడుస్తోంది. పెళ్లి తర్వాత బరువు పెరగడానికి కారణం ప్రతిరోజు సెక్స్ చేయడమే అని చాలామంది చెబుతుంటారు.శాస్త్రవేత్తలు మాత్రం ఇది వట్టి వాదనే అని కొట్టి పారేస్తున్నారు.సెక్స్ చేయడం వల్ల బరువు పెరుగుతారు అంటే సెక్స్ చేయడం మానేస్తే బరువు తగ్గాలిగా మరి అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా స్త్రీ పురుషులు ఇద్దరు వివాహం తర్వాత ప్రతిరోజు శారీరకంగా కలుస్తుంటారు కాబట్టి బరువు పెరగడానికి సెక్స్ కారణమని భావిస్తుంటారు.శరీర బరువు పెరిగి లావు అవడానికి కేవలం సెక్స్ మాత్రమే కారణం కాదు చాలా కారణాలు ఉంటాయి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పెళ్లి బంధం తర్వాత దంపతులిద్దరూ చాలా సంతోషంగా తృప్తిగా జీవిస్తుంటారు. దీని కారణంగా
మన శరీరం ప్రోలాక్టిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీనినే రిలాక్స్ హార్మోన్స్ అని కూడా అంటారు ఈ హార్మోన్లు అధికంగా విడుదలైతే బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే శరీర బరువు పెరిగి ఉబకాయ సమస్యకు మన రోజువారి ఆహారపలవాట్లు,జీవనశైలి అధిక విశ్రాంతి కారణం. అంతేకానీ ప్రతిరోజు సెక్స్ కార్యకలాపాలు చేయడం వల్ల బరువు పెరుగుతారు అన్నది ఆవాస్తవమని చెప్తున్నారు.

సాధారణంగా పెళ్లయిన తర్వాత రెగ్యులర్‌గా సెక్స్ చేయడం ప్రారంభిస్తారు. దీనివల్ల మన శరీరంలోని
అధిక కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది
తద్వారా శరీర బరువు తగ్గి గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. అంతేకానీ సెక్స్ చేయడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశం చాలా తక్కువ మహిళల్లో హార్మోన్ల వ్యత్యాసం వల్ల శరీర బరువు తొందరగా పెరుగుతుంది.మరొక అధ్యయనం ప్రకారం సెక్స్ చేసే సమయంలో ఆకలిని నియంత్రించే ఆక్సిటోసిన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. వీటిని ప్రేమ హార్మోన్లు అని కూడా పిలుస్తారు.ఈ హార్మోను మనలో ఆకలిని తగ్గించి బరువు పెరగడాన్ని నివారిస్తుంది