ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.3.70 లక్షల వేతనంతో?

ఇండియా పోస్ట్ పేమెంట్స్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. జనరల్ మేనేజర్/ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024 సంవత్సరం జనవరి 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. సీఏ, ఎంబీఏ, సీ.ఎఫ్.ఏ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.

2023 సంవత్సరం నవంబర్ 1వ తేదీ నాటికి 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 3.7 లక్షల రూపాయల వేతనం లభించనుందని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 150 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉండనుంది.

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, అసెస్ మెంట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతుండటం గమనార్హం.

భారీ మొత్తంలో వేతనం లభిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు ఒకింత పోటీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగం చేయాలని భావించే వాళ్లకు ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. కనీసం 38 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.