ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.50 వేల వేతనంతో?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. మహారత్న హోదా కంపెనీ అయిన ఈ సంస్థ నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. తాజాగా ఈ సంస్థ నుంచి కార్పొరేట్ కమ్యూనికేషన్, హ్యూమన్ రిసోర్స్, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్లు విడుదల కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

 

జులై 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు ఉండటం గమనార్హం.

 

https://www.iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు యూజీసీ నెట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, రిటెన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.

 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనంతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా లభించనున్నాయి. వెబ్ సైట్ ద్వారా దరఖాస్తుకు సంబంధ్హించిన సందేహాలను సైతం నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్లు నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలు చేస్తున్నాయనే సంగతి తెలిసిందే.