ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో భారీగా జాబ్స్.. నెలకు రూ.50 వేల వేతనంతో?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. రిఫైనరీ, పెట్రో కెమికల్ యూనిట్లలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఇప్పటికే జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థుల కోసం తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది.

 

వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా అర్హత ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. www.iocl.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వెబ్ సైట్ లో ఫ్రొఫెషనల్స్ రిక్రూట్‌మెంట్‌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

 

ఈ ఉద్యోగ ఖాళీల కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, రిటెన్ ప్రొఫిషియన్సీ టెస్ట్, యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు వేతనంతో పాటు డీఏ, ఇతర అలవెన్స్‌లు లభిస్తాయి. దేశంలోని ఏదైనా ప్లాంట్‌లో పని చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ వరుస జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తుండటం గమనార్హం. ఇండియన్ ఆయిల్ జాబ్ నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు జరగనుంది.