ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. 1702 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండటం గమనార్హం. https://www.iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పే ఛాన్స్ ఉంటుంది.
ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఐటీఐ, 12వ తరగతి, గ్రాడ్యుయేట్, డిప్లొమా పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల నుంచి 24 నెలల శిక్షణ ఉండనుందని సమాచారం అందుతోంది.
నవంబర్ 20 సాయంత్రం 5 గంటల వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. నవంబర్ 27వ తేదీ నుంచి అడ్మిట్ కార్డులు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రాత పరీక్షను డిసెంబర్ నెల 3వ తేదీన నిర్వహిస్తారు. 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూల్స్ ప్రకారం సడలింపులు ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. https://www.iocrefrecruit.in/iocrefrecruit/main_special_oct21.aspx వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.