పోస్టాఫీస్ స్కీమ్స్ గురించి మనలో చాలామందికి అవగాహన ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయనే సంగతి తెలిసిందే. బాల్ జీవన్ భీమా యోజన పేరుతో పోస్టాఫీస్ స్కీమ్ ఒకటి అమలవుతుండగా సురక్షితమైన పెట్టుబడి ఎంపికను చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు.
పోస్టాఫీస్ రికరింగ్, సేవింగ్స్ కు సంబంధించి ఉన్న బెస్ట్ స్కీమ్స్ లో బాల్ జీవన్ భీమా యోజన ఒకటి కాగా రోజుకు కేవలం 6 రూపాయలు పెట్టుబడిగా పెట్టడం ద్వారా లక్ష రూపాయలకు బీమా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పిల్లల చదువులకు, ఆర్థికపరమైన ఖర్చులకు ఈ స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ప్రమాదం వల్ల బిడ్డ చనిపోతే తల్లీదండ్రులు ఈ స్కీమ్ బెనిఫిట్ పొందడానికి అర్హులు.
పిల్లలు చనిపోతే కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడంలో ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. రోజువారీ పెట్టుబడి ఎంపిక తల్లిదండ్రుల భారాన్ని తగ్గించడంలో ఈ స్కీమ్ సహాయపడుతుందని చెప్పవచ్చు. సరైన ధ్రువపత్రాలను అందించడంతో పాటు పూర్తి వివరాలను నింపి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టాఫీస్ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ తప్పని సరిగా జత చేసి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పిల్లల పేరు, చిరునామా, వయస్సు, నామినీ మొదలైన సమాచారం ఇవ్వడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.