నిరుద్యోగులకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ శుభవార్త.. రూ.69 వేల వేతనంతో?

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1130 మంది కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. https://cisfrectt.cisf.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో 66 సీట్లు జనరల్ కేటగిరీ, 144 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

153 షెడ్యూల్డ్ కులాలు, 161 షెడ్యూల్డ్ తెగలు, 236 ఖాళీలు ఓబీసీ ఉద్యోగాలను సైతం ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆగష్టు నెల 30వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఆన్ లైన్ ప్రక్రియ మొదలుకానుంది. 2024 సంవత్సరం సెప్టెంబర్ 30 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. 23 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు గరిష్టంగా ఐదేళ్ల వయో పరిమితి సడలింపులు ఉండగా ఓబీసీకి మూడు సంవత్సరాల సడలింపులు ఉంటాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులు ఫైర్‌మెన్ ఖాళీల కోసం దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని తెలుస్తోంది.

ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీగానే వేతనం లభించనుందని భోగట్టా. కనీసం 21,700 రూపాయల నుంచి గరిష్టంగా 69100 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.