మనలో కోటీశ్వరులు కావాలని కలలు కనని వాళ్లు దాదాపుగా ఉండరనే సంగతి తెలిసిందే. మనలో చాలామంది కష్టాలు తీరి ధనవంతులు కావాలనే ఆలోచనతోనే ప్రముఖ ఆలయాలను దర్శించుకోవడం జరుగుతుంది. సికింద్రాబాద్ లో ఉండే అష్టలక్ష్మీ ఆలయంను దర్శించుకుంటే కోటీశ్వరులు అవుతారని చాలామంది భావిస్తారు.
గర్భాలయంలో అమ్మవారు పద్మంలో కూర్చుని దర్శనమిస్తూ ఉండే ఆలయానికి భక్తుల రద్దీ ఒకింత ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. రెండు చేతుల్లో పద్మాలను ధరించి అభయ వరద హస్తాలతో భక్తులను అనుగ్రహిస్తూ ఈ దేవాలయంలో అమ్మవారు ఉంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత తమ కష్టాలు తీరాయని చాలామంది భక్తులు చెబుతున్నారు.
చక్కని కనుముక్కు తీరుతో కళకళలాడుతూ కనిపించే ఇక్కడి అమ్మవారిని చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఇక్కడి అమ్మవారిని నిత్యం ఆరాధించడం వల్ల ఉన్న కష్టాలు తొలగిపోవడంతో పాటు కొత్త కష్టాలు వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయని ఇందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. ఈ ఆలయంలో మరో భాగంగా శిరిడీ సాయిబాబా ఆలయంతో పాటు బాబా జీవిత విశేషాలు సైతం ఉంటాయి.
బస్సు మార్గం ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే సాయి కాలానికి వెళ్లినట్టు అనిపిస్తుందని కొందరు భక్తులు కామెంట్లు చేస్తున్నారు. కాసులు కురిపించే అమ్మవారు, సాయిబాబా ఒకే ఆలయంలో ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు ధనలక్ష్మీ క్షేత్రం అని పిలుస్తారు.